Breaking News

మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత.. హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చేరిక

ఏపీ మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌ గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో ఆయన చేరారు.


Published on: 27 Mar 2025 15:28  IST

ఏపీ మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ఆయన చికిత్స కోసం చేరారు. గ్యాస్ట్రిక్ సమస్యతో ఆసుపత్రికి వెళ్లిన నానికి, పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుండె సంబంధిత సమస్య కూడా ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆయనకు అవసరమైన వైద్యసేవలు అందిస్తున్నారు.

కొడాలి నాని ఆసుపత్రిలో చేరారనే వార్త తెలిసిన వెంటనే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలను వైద్యులు ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి