Breaking News

తొమ్మిదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థి తన తోటి విద్యార్థినులను వేధిస్తూ, వారి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను హ్యాక్ చేసినట్లు గుర్తించారు.

అతడు విద్యార్థినుల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను హ్యాక్ చేసి, వారి వ్యక్తిగత ఫోటోలు సేకరించి, తోటి మగపిల్లలకు పంపి ఇతర బాలికల ఫోటోలతో కొత్త ఫేక్ ఖాతాలు సృష్టించి,మెసేజ్లు చేస్తూ తనను ప్రేమించాలని వేధించేవాడు.


Published on: 27 Mar 2025 14:34  IST

కడప జిల్లాలో చోటుచేసుకున్న ఒక ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తొమ్మిదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థి తన తోటి విద్యార్థినులను వేధిస్తూ, వారి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను హ్యాక్ చేసినట్లు గుర్తించారు. అతని చేష్టలు బయటపడటంతో, స్కూల్ ఉపాధ్యాయులు మందలించారు. అయితే, బాలుడు తన తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు అనవసరంగా తనను కొట్టారని చెప్పడంతో, వారు స్కూల్‌కు వెళ్లి ఉపాధ్యాయులను ప్రశ్నించడంతో పాటు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసుల విచారణలో బాలుడి నిర్వాకం వెలుగుచూసింది. అతడు ఐదుగురు విద్యార్థినుల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను హ్యాక్ చేసి, వారి వ్యక్తిగత ఫోటోలు సేకరించి, తోటి మగపిల్లలకు పంపినట్లు వెల్లడైంది. అంతేకాకుండా, స్కూల్‌లో చదువుతున్న ఇతర బాలికల ఫోటోలతో కొత్త ఫేక్ ఖాతాలు సృష్టించి,మెసేజ్లు చేస్తూ తనను ప్రేమించాలని వేధించేవాడు. తనను ప్రేమించకపోతే మీ ఫోన్ నంబర్లను అబ్బాయిలకు ఇస్తానని, ఫోటోలను, వీడియోలను అసభ్యకరంగా సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించేవాడు. ఇలా 32 ఫేక్ ఐడీలను క్రియేట్ చేసి ప్రేమించకుంటే మీ వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు అందరికీ షేర్ చేస్తానని బాలికలను బ్లాక్మెయిల్ చేసేవాడు అని పోలీసుల దర్యాప్తులో తెలిసింది.

ఈ వ్యవహారం బహిర్గతమైన తర్వాత బాధిత విద్యార్థినుల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. తమ పిల్లలను వేధించిన బాలుడి తల్లిదండ్రుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై స్కూల్ యాజమాన్యం, పోలీస్ అధికారులు దర్యాప్తు చేపట్టి, బాలుడితో పాటు, అతని తల్లిదండ్రులు మరియు వారికి సహకరించిన స్థానిక కౌన్సిలర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 

Follow us on , &

ఇవీ చదవండి