Breaking News

ఆంధ్రప్రదేశ్‌ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను డాక్టరేట్ వరించింది.

హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్‌లో అమెరికన్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ సలహాదారుడు మార్క్ బర్న్ చేతుల మీదుగా శ్రీనివాస్ ‘డాక్టరేట్’ సత్కారం పొందినట్లు సమాచారం. దీనికి సంబంధించి ట్విట్టర్ (ఎక్స్)లో ఒక పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది.


Published on: 26 Mar 2025 11:13  IST

ఆంధ్రప్రదేశ్‌ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు డాక్టరేట్‌ లభించింది. హైదరాబాద్‌లోని గ్రీన్ పార్క్ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో, అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సలహాదారు మార్క్ బర్న్ చేతుల మీదుగా ఈ గౌరవాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒక ఫొటో సోషల్ మీడియా (ట్విట్టర్/ఎక్స్)లో వైరల్ అవుతోంది.

డే స్ప్రింగ్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం, దువ్వాడ శ్రీనివాస్ సేవలను, సమాజం కోసం ఆయన అందించిన విశిష్ట సేవలను గుర్తించి ఈ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసినట్లు సమాచారం. ఈ అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Follow us on , &

ఇవీ చదవండి