Breaking News

ఢిల్లీ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా తన మొట్టమొదటి ఫ్లాగ్‌షిప్ 'మహారాజా లాంజ్' ను నిన్న ఆవిష్కరించింది.

ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI) టెర్మినల్ 3లో ఎయిర్ ఇండియా తన మొట్టమొదటి ఫ్లాగ్‌షిప్ 'మహారాజా లాంజ్' (The Maharaja Lounge) ను నిన్న (ఫిబ్రవరి 6, 2026) ఆవిష్కరించింది


Published on: 07 Feb 2026 10:57  IST

ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI) టెర్మినల్ 3లో ఎయిర్ ఇండియా తన మొట్టమొదటి ఫ్లాగ్‌షిప్ 'మహారాజా లాంజ్' (The Maharaja Lounge) ను నిన్న (ఫిబ్రవరి 6, 2026) ఆవిష్కరించింది.ఈ లాంజ్ ఫిబ్రవరి 6న ఆవిష్కరించబడినప్పటికీ, ప్రయాణికులకు ఫిబ్రవరి 16, 2026 నుండి అందుబాటులోకి రానుంది.

ఎయిర్ ఇండియా బిజినెస్ క్లాస్, ఫస్ట్ క్లాస్ ప్రయాణికులు, మహారాజా క్లబ్ గోల్డ్ మరియు ప్లాటినం సభ్యులు, అలాగే ఎలిజిబుల్ స్టార్ అలయన్స్ ప్రయాణికులు దీనిని ఉపయోగించుకోవచ్చు.16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ లాంజ్ సుమారు 300 మంది అతిథులకు వసతి కల్పిస్తుంది.

లైవ్ కుకింగ్ స్టేషన్లు, 'బెవరేజ్ ఆన్ వీల్స్' (మొబైల్ బార్ సర్వీస్), ప్రత్యేక టీ ప్రోగ్రామ్, వర్క్ ఏరియాలు మరియు విశ్రాంతి తీసుకోవడానికి ప్రత్యేక జోన్‌లు ఉన్నాయి.భారతీయ సంస్కృతి మరియు ఆధునిక హంగులతో దీనిని హిర్ష్ బెడ్నర్ అసోసియేట్స్ (HBA) రూపొందించారు. 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement