Breaking News

వాట్సప్ సంస్థ భారతీయ వినియోగదారుల కోసం సరికొత్త వయో నిబంధనలను మరియు ఏజ్ వెరిఫికేషన్ ప్రక్రియను పరీక్షిస్తోంది

భారతదేశంలో వాట్సప్ స్వంతంగా వినియోగించడానికి కనీస వయస్సు 13 సంవత్సరాలు ఉండాలి. ప్రస్తుతం భారతదేశంలో అమల్లోకి రానున్న ‘డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్’ నిబంధనలకు అనుగుణంగా, వాట్సప్ సంస్థ భారతీయ వినియోగదారుల కోసం సరికొత్త వయో నిబంధనలను మరియు ఏజ్ వెరిఫికేషన్ ప్రక్రియను పరీక్షిస్తోంది.

Published on: 03 Aug 2026 15:17  IST

భారతదేశంలో వాట్సప్ స్వంతంగా వినియోగించడానికి కనీస వయస్సు 13 సంవత్సరాలు ఉండాలి. ప్రస్తుతం భారతదేశంలో అమల్లోకి రానున్న ‘డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్’ నిబంధనలకు అనుగుణంగా, వాట్సప్ సంస్థ భారతీయ వినియోగదారుల కోసం సరికొత్త వయో నిబంధనలను మరియు ఏజ్ వెరిఫికేషన్ ప్రక్రియను పరీక్షిస్తోంది.

కనీస వయస్సు నిబంధనలు

13 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు పిల్లల కోసం ఎలాంటి తల్లిదండ్రుల నిఘా లేకుండా వాట్సప్‌ను స్వంతంగా వాడుకోవచ్చు.13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు పిల్లల కోసం వాట్సప్ ప్రత్యేకంగా 'పేరెంట్-మేనేజ్డ్ అకౌంట్స్' ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా తల్లిదండ్రుల పర్యవేక్షణలో మాత్రమే పిల్లలు చాటింగ్ లేదా కాల్స్ చేసుకోగలరు.

భద్రతా ఫీచర్లు , నియంత్రణలు

పేరెంట్ పిన్ : పిల్లల ఖాతాలను కంట్రోల్ చేయడానికి తల్లిదండ్రులు 6 అంకెల పిన్ సెట్ చేసుకోవచ్చు.

గ్రూప్స్ నియంత్రణ: పిల్లలను అపరిచిత వ్యక్తులు గ్రూపుల్లో యాడ్ చేయకుండా తల్లిదండ్రులు నియంత్రించవచ్చు.

డేటా ప్రైవసీ: చట్టపరమైన నిబంధనల ప్రకారం చిన్నపిల్లల డేటాను వాట్సప్ దుర్వినియోగం చేయకుండా రక్షణ లభిస్తుంది.

Follow us on , &

ఇవీ చదవండి

Advertisement