Breaking News

విప్రో జూనియర్ మరియు మిడ్-లెవల్ ఉద్యోగులకు ఊరటనిస్తూ బెంచ్ వ్యవధిని గరిష్ఠంగా 180 క్యాలెండర్ రోజులకు పొడిగించింది

ప్రముఖ ఐటీ దిగ్గజం విప్రో (Wipro) తన ఉద్యోగుల బెంచ్ విధానంలో కీలక మార్పులు చేసింది. మిగిలిన ఐటీ కంపెనీలు బెంచ్ సమయాన్ని తగ్గిస్తున్న తరుణంలో, విప్రో మాత్రం జూనియర్ మరియు మిడ్-లెవల్ ఉద్యోగులకు ఊరటనిస్తూ బెంచ్ వ్యవధిని గరిష్ఠంగా 180 క్యాలెండర్ రోజులకు (ఆరు నెలలు) పొడిగించింది


Published on: 02 Oct 2026 11:32  IST

ప్రముఖ ఐటీ దిగ్గజం విప్రో (Wipro) తన ఉద్యోగుల బెంచ్ విధానంలో కీలక మార్పులు చేసింది. మిగిలిన ఐటీ కంపెనీలు బెంచ్ సమయాన్ని తగ్గిస్తున్న తరుణంలో, విప్రో మాత్రం జూనియర్ మరియు మిడ్-లెవల్ ఉద్యోగులకు ఊరటనిస్తూ బెంచ్ వ్యవధిని గరిష్ఠంగా 180 క్యాలెండర్ రోజులకు (ఆరు నెలలు) పొడిగించింది.

కొత్త బెంచ్ విధానం ముఖ్యాంశాలు:

అర్హత: ఈ 180 రోజుల పొడిగింపు కేవలం బ్యాండ్ 2 మరియు అంతకంటే తక్కువ స్థాయిలో ఉన్న జూనియర్, మిడ్-లెవల్ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది.

వ్యవధి లెక్కింపు: ఒక ఉద్యోగి బిల్ చేయదగిన ప్రాజెక్ట్ నుండి విడుదలైన తేదీ నుండి లేదా ఆన్‌సైట్ అసైన్‌మెంట్ పూర్తి చేసుకుని భారత్‌కు తిరిగి వచ్చి, మరో ప్రాజెక్ట్ కేటాయించని తేదీ నుండి ఈ 180 రోజులను లెక్కిస్తారు.

మినహాయింపులు:

బ్యాండ్ 3 మరియు ఆ పైన: వీరికి ఈ 6 నెలల రూల్ వర్తించదు. వీరి ప్రామాణిక బెంచ్ వ్యవధి 45 రోజులు మాత్రమే ఉంటుంది.

దివ్యాంగులు : వీరికి బెంచ్ వ్యవధి 75 రోజులు గా నిర్ణయించారు.

ఉద్యోగ ముగింపు:బెంచ్‌పై ఉన్న ఉద్యోగులకు ఈ 180 రోజుల వ్యవధిలోగా ఎలాంటి ప్రాజెక్ట్ దక్కకపోతే, వారు సంస్థ నుండి విడిపోవాల్సి ఉంటుంది.

కేపబిలిటీ డెవలప్‌మెంట్ ప్లాన్ :

ఈ పొడిగించిన బెంచ్ వ్యవధిని ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపరచడానికి విప్రో ఉపయోగించనుంది.

నిరంతరంగా నైపుణ్య లోపాలు ఉన్నట్లు ఇంటర్వ్యూలు లేదా అసెస్‌మెంట్ల ద్వారా తేలితే ఉద్యోగులను CDP లో ఉంచుతారు.

కేవలం ఒక ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయినంత మాత్రాన CDP కి పంపరు. వరుసగా 3 ఇంటర్వ్యూలలో రిజెక్ట్ అయితేనే ఈ ప్రక్రియను ప్రారంభిస్తారు.

మారుతున్న మార్కెట్ డిమాండ్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం నేపథ్యంలో విప్రో తన ఉద్యోగులకు కొత్త ప్రాజెక్ట్‌లను వెతుక్కోవడానికి ఈ అదనపు సమయాన్ని కల్పించింది.

 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement