Breaking News

భారతదేశంలోని పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసెస్ రంగం కోసం కెఫిన్ టెక్నాలజీస్ 'ఇన్ ప్రో' అనే వినూత్న ప్లాట్‌ఫారమ్‌ ప్రారంభం

భారతదేశంలోని పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసెస్ రంగం కోసం కెఫిన్ టెక్నాలజీస్ మరియు అసోసియేషన్ ఆఫ్ పోర్ట్‌ఫోలియో మేనేజర్స్ ఇన్ ఇండియా (APMI) సంయుక్తంగా 'ఇన్ ప్రో' అనే వినూత్న యాంటీ-మనీ లాండరింగ్ కంప్లయన్స్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించాయి.


Published on: 02 Oct 2026 12:18  IST

భారతదేశంలోని పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసెస్ రంగం కోసం కెఫిన్ టెక్నాలజీస్ మరియు అసోసియేషన్ ఆఫ్ పోర్ట్‌ఫోలియో మేనేజర్స్ ఇన్ ఇండియా (APMI) సంయుక్తంగా 'ఇన్ ప్రో' అనే వినూత్న యాంటీ-మనీ లాండరింగ్ కంప్లయన్స్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించాయి. అక్టోబర్ 1, 2026 న ముంబైలో జరిగిన APMI 3వ వార్షిక సదస్సులో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) చైర్మన్ తుహిన్ కాంత పాండే చేతుల మీదుగా ఈ ప్లాట్‌ఫారమ్ అధికారికంగా లాంచ్ చేయబడింది.

'ఇన్ ప్రో' ప్లాట్‌ఫారమ్ ముఖ్య వివరాలు & ప్రయోజనాలు:

నిరంతర పర్యవేక్షణ : పెట్టుబడిదారులు చేరే సమయంలో ఒకసారి మాత్రమే KYC తనిఖీలు చేసే పద్ధతి నుండి, నిరంతరం వారి రిస్క్ ప్రొఫైల్‌ను ట్రాక్ చేసే విధానానికి ఈ ప్లాట్‌ఫారమ్ శ్రీకారం చుట్టింది.

గ్లోబల్ స్క్రీనింగ్: పెట్టుబడిదారుల ప్రొఫైల్‌లను అంతర్జాతీయ ఆంక్షల జాబితాలు , పొలిటికల్లీ ఎక్స్‌పోజ్డ్ పర్సన్స్ (PEP) డేటాబేస్‌లు మరియు ఇతర ప్రతికూల మీడియా వార్తల ఆధారంగా ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా నిరంతరం స్క్రీనింగ్ చేయవచ్చు.

ఉమ్మడి సాంకేతిక వేదిక : APMI లోని సభ్యులందరికీ ఇది ఒకే రకమైన సెంట్రల్ కంప్లయన్స్ ప్లాట్‌ఫారమ్‌గా పనిచేస్తుంది. దీనివల్ల ప్రతి PMS సంస్థ స్వతంత్రంగా ఖరీదైన AML నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉండదు.

చిన్న , మధ్యతరహా సంస్థలకు లబ్ధి: నిబంధనల పరంగా పెద్ద కంపెనీలతో సమానమైన బాధ్యతలు ఉండి, సొంతంగా టెక్నాలజీని అభివృద్ధి చేసుకోలేని చిన్న మరియు మధ్యస్థ స్థాయి పోర్ట్‌ఫోలియో మేనేజర్లకు ఈ భాగస్వామ్య ప్లాట్‌ఫారమ్ ఎంతో పొదుపుగా మరియు సహాయకరంగా ఉంటుంది.

ఆడిట్ మరియు కేస్ మేనేజ్‌మెంట్: అనుమానాస్పద అలర్ట్‌లను పరిశీలించడానికి ఇందులో 'మేకర్-చెకర్ వర్క్‌ఫ్లో' ఉంటుంది. ఫలితంగా భవిష్యత్తులో సెబీ (SEBI) లేదా అంతర్గత ఆడిటింగ్ జరిపినప్పుడు నివేదికలను సులభంగా సమర్పించవచ్చు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement