Breaking News

ఈ ఆర్థిక సంవత్సరం 2024-25కి సంబంధించి అడ్వాన్స్ ట్యాక్స్ పూర్తిగా చెల్లించేందుకు మార్చి 31, 2025 వరకే గడువు ఉంది.

వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్. మీరు మీ అడ్వాన్స్ ట్యాక్స్ మార్చి 15లోగా చెల్లించలేకపోయారా? అయితే మీకో చివరి అవకాశం ఉంది. మార్చి 31వ తేదీలోపు చెల్లిస్తే అదనపు వడ్డీ తప్పించుకోవచ్చు


Published on: 19 Mar 2025 14:30  IST

ఈ ఆర్థిక సంవత్సరం 2024-25కు సంబంధించిన అడ్వాన్స్ ట్యాక్స్ పూర్తి చేయడానికి గడువు మార్చి 15, 2025తో ముగిసిపోయింది. అయితే, ఇప్పటికీ చాలా మంది చివరి విడత ట్యాక్స్ చెల్లించలేదని నివేదికలు చెబుతున్నాయి. మీరు కూడా మీ పన్ను సమయానికి చెల్లించలేకపోయారా? అలాంటప్పుడు, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234C ప్రకారం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే, అదనపు వడ్డీ భారం తగ్గించుకోవడానికి మరియు ఆలస్యపు చెల్లింపుపై మరింత పెనాల్టీ తప్పించుకోవడానికి అవకాశం ఉంది. మీరు మార్చి 31, 2025 లోపు మీ మిగిలిన అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లిస్తే, కొన్ని వడ్డీల నుండి మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది.

అడ్వాన్స్ ట్యాక్స్ చివరి విడత చెల్లింపుకు గడువు మార్చి 15, 2025గా నిర్ణయించబడినప్పటికీ, కొంతమంది నిర్దిష్ట వడ్డీతో మార్చి 31, 2025 లోపు చెల్లించవచ్చు. అయితే, మీరు ఈ గడువును కూడా మిస్ అయితే, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234B ప్రకారం అదనపు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అంటే, లేటుగా చెల్లించినట్లయితే 234C మరియు 234B సెక్షన్ల కింద వడ్డీ భారం ఎదుర్కోవాల్సి ఉంటుంది. సాధారణంగా, ఏ వ్యక్తికైనా ఆర్థిక సంవత్సరానికి రూ.10,000కు మించి పన్ను చెల్లించాల్సి వస్తే, అతను దానిని అడ్వాన్స్ రూపంలో విడతల వారీగా చెల్లించడం అవసరం.

వడ్డీ భారం తగ్గించుకోవడానికి మార్గం?

మీరు మార్చి 15 గడువు తర్వాత ట్యాక్స్ చెల్లిస్తే, సెక్షన్ 234C ప్రకారం 1% వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా డిసెంబర్ 15, 2024 నాటికి 75% ట్యాక్స్ చెల్లించాలి, ఇక మార్చి 15 నాటికి 100% పూర్తి కావాలి. అయితే, మీరు మార్చి 15 కాకుండా మార్చి 17, 2025న చెల్లిస్తే, 4% స్థానంలో 1% మాత్రమే వడ్డీ పడుతుంది. పన్ను నిపుణుల ప్రకారం, ఆలస్యంగా అయినా త్వరగా చెల్లిస్తే, పెనాల్టీని తగ్గించుకునే అవకాశం ఉంటుంది.

Follow us on , &

ఇవీ చదవండి