Breaking News

దేశీయ మార్కెట్‌లో వెండి ధరలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కిలో రూ. 4 లక్షల మార్కును దాటి సరికొత్త రికార్డు

నేడు 29 జనవరి 2026న దేశీయ మార్కెట్‌లో వెండి ధరలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కిలో రూ. 4 లక్షల మార్కును దాటి సరికొత్త రికార్డు సృష్టించాయి.


Published on: 29 Jan 2026 10:47  IST

నేడు 29 జనవరి 2026న దేశీయ మార్కెట్‌లో వెండి ధరలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కిలో రూ. 4 లక్షల మార్కును దాటి సరికొత్త రికార్డు సృష్టించాయి. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు (ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణ వాతావరణం), పారిశ్రామికంగా పెరుగుతున్న డిమాండ్ మరియు రూపాయి విలువ క్షీణించడం వంటి కారణాలతో వెండి ధరలు చుక్కలనంటుతున్నాయి. 

ఎంసీఎక్స్‌ (MCX) ఫ్యూచర్స్ మార్కెట్‌లో కిలో వెండి ధర ఏకంగా రూ. 4,00,000 దాటి పరుగులు పెడుతోంది.

హైదరాబాద్ ఇక్కడ కిలో వెండి ధర సుమారు రూ. 4,00,100 నుంచి రూ. 4,25,000 మధ్య ట్రేడ్ అవుతోంది.

విజయవాడ కిలో ధర రూ. 4,00,100 గా నమోదైంది.

రాజమండ్రి అత్యధికంగా కిలో వెండి రూ. 4,25,000 కి చేరింది.

ఒక్కరోజులోనే భారీ మార్పు  గత కొద్ది రోజులుగా రోజుకు రూ. 10,000 నుండి రూ. 25,000 వరకు ధరలు పెరుగుతూ వస్తున్నాయి. 

ఈ అసాధారణ పెరుగుదలకు కారణం డాలర్ ఇండెక్స్ పడిపోవడం మరియు సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు (EV), సోలార్ ప్యానెళ్ల తయారీలో వెండి వినియోగం విపరీతంగా పెరగడమేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి