Breaking News

హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ 2025-26 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసిక (Q3) ఫలితాలను విడుదల చేసింది.

హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ 2025-26 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసిక (Q3) ఫలితాలను జనవరి 28, 2026న విడుదల చేసింది.


Published on: 29 Jan 2026 18:47  IST

హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ 2025-26 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసిక (Q3) ఫలితాలను జనవరి 28, 2026న విడుదల చేసింది.ఈ త్రైమాసికంలో సంస్థ నికర లాభం ₹34.5 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే సమయంతో  పోలిస్తే ఇది దాదాపు 20% వరకు తగ్గింది.లాభాలు తగ్గినప్పటికీ, ఆదాయం మాత్రం 8.2% పెరిగి 1,119.1 కోట్లకు చేరుకుంది.

పాల సేకరణ ధరలు పెరగడం, మార్కెట్‌లో తీవ్రమైన పోటీ మరియు కొత్త కార్మిక చట్టాల అమలు కోసం చేసిన వన్-టైమ్ ఖర్చులు (సుమారు ₹2.78 కోట్లు) లాభాలపై ప్రభావం చూపాయని సంస్థ తెలిపింది.ఫలితాల ప్రభావంతో జనవరి 29, 2026న హెరిటేజ్ ఫుడ్స్ షేరు ధర భారీగా పతనమైంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో దాదాపు 10% నుంచి 20% వరకు క్షీణించి ₹360 సమీపానికి చేరుకుంది. దీనివల్ల ప్రమోటర్లకు, ముఖ్యంగా నారా భువనేశ్వరి గారికి సుమారు ₹86 కోట్ల మేర సంపద తగ్గినట్లు వార్తలు వచ్చాయి.

Follow us on , &

ఇవీ చదవండి