Breaking News

భారతదేశంలోని విద్యార్థుల కోసం Adobe సంస్థ తమ ప్రీమియం సాఫ్ట్‌వేర్‌లను ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది

భారతదేశంలోని విద్యార్థుల కోసం Adobe సంస్థ ఫిబ్రవరి 19, 2026న ఒక అద్భుతమైన ప్రకటన చేసింది. న్యూఢిల్లీలో జరుగుతున్న India AI Impact Summit 2026 లో భాగంగా, విద్యార్థులకు తమ ప్రీమియం సాఫ్ట్‌వేర్‌లను ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది.  


Published on: 19 Feb 2026 19:02  IST

భారతదేశంలోని విద్యార్థుల కోసం Adobe సంస్థ ఫిబ్రవరి 19, 2026న ఒక అద్భుతమైన ప్రకటన చేసింది. న్యూఢిల్లీలో జరుగుతున్న India AI Impact Summit 2026 లో భాగంగా, విద్యార్థులకు తమ ప్రీమియం సాఫ్ట్‌వేర్‌లను ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది.  దేశంలోని గుర్తింపు పొందిన ఉన్నత విద్యాసంస్థల (Accredited Higher Education Institutions) విద్యార్థులు Adobe PhotoshopAdobe Acrobat, మరియు Adobe Firefly (AI టూల్) వంటి పవర్ ఫుల్ యాప్స్‌ను పూర్తిగా ఉచితంగా పొందవచ్చు.

ఈ ప్లాన్ ద్వారా భారత్‌లోని దాదాపు 15,000 పాఠశాలలు మరియు 500 కళాశాలల్లో ఉన్న 'కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్' ద్వారా విద్యార్థులకు ఈ సాఫ్ట్‌వేర్‌లను అందుబాటులోకి తెస్తారు.సాఫ్ట్‌వేర్‌తో పాటు, Adobe సంస్థ విద్యార్థులకు కావాల్సిన శిక్షణా మాడ్యూల్స్ (Training Modules) మరియు పరిశ్రమలో గుర్తింపు పొందే సర్టిఫికేషన్‌లను కూడా ఉచితంగా అందిస్తుంది.

యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ (VFX), గేమింగ్ మరియు కామిక్స్ (AVGC) రంగాల్లో 2030 నాటికి 2 మిలియన్ల ఉద్యోగాలను సృష్టించాలనే ప్రభుత్వ లక్ష్యానికి మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నారు.దీని కోసం Adobe సంస్థ NASSCOM FutureSkills Prime తో కలిసి విద్యార్థులకు AI-ఆధారిత నైపుణ్యాలను నేర్పించనుంది.

Follow us on , &

ఇవీ చదవండి