Breaking News

రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ మేనేజింగ్ డైరెక్టర్ (MD)గా ఆకాశ్ అంబానీ నియమితులయ్యారు

రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ మేనేజింగ్ డైరెక్టర్ (MD)గా ఆకాశ్ అంబానీ నియమితులయ్యారు. ఈ నియామకం 2026 ఏప్రిల్ 9 నుండి ఐదేళ్ల పాటు అమలులోకి వస్తుందని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్స్‌లో పేర్కొంది.


Published on: 14 May 2026 15:41  IST

రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్ మేనేజింగ్ డైరెక్టర్ (MD)గా ఆకాశ్ అంబానీ నియమితులయ్యారు. ఈ నియామకం 2026 ఏప్రిల్ 9 నుండి ఐదేళ్ల పాటు అమలులోకి వస్తుందని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్స్‌లో పేర్కొంది.

2026 ఏప్రిల్ 9 నుండి ఐదేళ్ల పాటు ఆకాశ్ అంబానీ ఈ పదవిలో కొనసాగుతారు.జియో ప్లాట్‌ఫామ్స్ భారీ మెగా ఐపీఓ (IPO)కు సిద్ధమవుతున్న తరుణంలో ఈ లీడర్‌షిప్ మార్పు జరిగింది. కంపెనీ మే లేదా జూన్ నాటికి సెబీ (SEBI)కి డ్రాఫ్ట్ పేపర్లు (DRHP) సమర్పించే అవకాశం ఉంది.

అంబానీ ముగ్గురు పిల్లలలో (ఈషా, ఆకాశ్, అనంత్) మేనేజింగ్ డైరెక్టర్ (MD) హోదా దక్కించుకున్న తొలి వారసుడు ఆకాశే కావటం విశేషం. ఆయన ఇప్పటికే రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.ఆర్థిక సంవత్సరం FY26 లో జియో ప్లాట్‌ఫామ్స్ రూ. 1.46 లక్షల కోట్ల ఆదాయాన్ని, రూ. 30,000 కోట్లకు పైగా నికర లాభాన్ని ఆర్జించింది.ఆకాశ్ నియామకంతో పాటు ప్రముఖ న్యాయ నిపుణురాలు జియా మోదీ (Zia Mody) ని కూడా జియో ప్లాట్‌ఫామ్స్ స్వతంత్ర డైరెక్టర్‌గా ఐదేళ్ల కాలానికి నియమించారు.

Follow us on , &

ఇవీ చదవండి