Breaking News

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన సంచలన రూ. 1 ఫ్రీడమ్ ప్లాన్ (Freedom 2.0) ను మళ్లీ అందుబాటులోకి తీసుకువచ్చింది

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన సంచలన రూ. 1 ఫ్రీడమ్ ప్లాన్ (Freedom 2.0) ను మళ్లీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్రత్యేక ఆఫర్ ఆగస్టు 12, 2026 నుండి సెప్టెంబర్ 12, 2026 వరకు అందుబాటులో ఉంటుంది.


Published on: 13 Aug 2026 20:17  IST

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన సంచలన రూ. 1 ఫ్రీడమ్ ప్లాన్ (Freedom 2.0) ను మళ్లీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్రత్యేక ఆఫర్ ఆగస్టు 12, 2026 నుండి సెప్టెంబర్ 12, 2026 వరకు అందుబాటులో ఉంటుంది.

రూ. 1 ప్లాన్ పూర్తి వివరాలు ,ప్రయోజనాలు:

ఉచిత సిమ్ కార్డ్: కొత్త కస్టమర్లకు బీఎస్ఎన్ఎల్ 4G సిమ్ కార్డ్ పూర్తిగా ఉచితంగా లభిస్తుంది.

వాలిడిటీ: ఈ ప్లాన్ ద్వారా 24 రోజుల పాటు వాలిడిటీ లభిస్తుంది.

ఉచిత డేటా: ప్రతిరోజూ 1 GB హై-స్పీడ్ 4G డేటా లభిస్తుంది.

ఉచిత కాల్స్: భారతదేశంలో ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్ మాట్లాడుకోవచ్చు.

ఎస్ఎమ్ఎస్ (SMS): రోజుకు 100 ఉచిత ఎస్ఎమ్ఎస్‌లు లభిస్తాయి.

ఈ ఫ్రీడమ్ ఆఫర్ కేవలం కొత్తగా బీఎస్ఎన్ఎల్ కనెక్షన్ తీసుకునే వారికి మరియు ఇతర నెట్‌వర్క్ నుండి బీఎస్ఎన్ఎల్‌కు మారే వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటికే ఉన్న పాత బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు ఇది వర్తించదు.

ఈ ఆఫర్‌ను పొందాలనుకునే వారు తమకు సమీపంలో ఉన్న BSNL కస్టమర్ సర్వీస్ సెంటర్ (CSC) లేదా అధీకృత రిటైల్ స్టోర్లను సందర్శించి కేవలం ఒక్క రూపాయి చెల్లించి కొత్త సిమ్ కార్డ్ మరియు ఈ ఉచిత ప్రయోజనాలను యాక్టివేట్ చేసుకోవచ్చు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement