Breaking News

భారతీయ జీవిత బీమా సంస్థ తన 70వ వార్షికోత్సవం సందర్భంగా రెండు సరికొత్త ఇన్సూరెన్స్ పాలసీల అధికారిక విడుదల

భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) తన 70వ వార్షికోత్సవం సందర్భంగా 1 సెప్టెంబర్ 2026న రెండు సరికొత్త ఇన్సూరెన్స్ పాలసీలను అధికారికంగా విడుదల చేసింది. LIC చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఆర్. దొరైస్వామి వీటిని ప్రారంభించారు. ఈ కొత్త ప్లాన్లు 7 సెప్టెంబర్ 2026 నుండి వినియోగదారులకు కొనుగోలు చేయడానికి అందుబాటులోకి వస్తాయి.


Published on: 02 Sep 2026 12:52  IST

భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) తన 70వ వార్షికోత్సవం సందర్భంగా 1 సెప్టెంబర్ 2026 రెండు సరికొత్త ఇన్సూరెన్స్ పాలసీలను అధికారికంగా విడుదల చేసింది. LIC చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఆర్. దొరైస్వామి వీటిని ప్రారంభించారు. ఈ కొత్త ప్లాన్లు 7 సెప్టెంబర్ 2026 నుండి వినియోగదారులకు కొనుగోలు చేయడానికి అందుబాటులోకి వస్తాయి.

LIC బీమా ప్లాటినమ్

ఇది పొదుపు మరియు లైఫ్ కవరేజ్ రెండింటినీ కలిపి అందించే ఒక నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ వ్యక్తిగత బీమా పథకం. మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా స్థిరమైన రాబడిని కోరుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది.

గ్యారెంటీడ్ అడిషన్స్: ఈ పాలసీలో ప్రీమియం చెల్లించే కాలంలో ప్రతి రూ. 1,000 బేసిక్ సమ్ అష్యూర్డ్‌కు రూ. 70 చొప్పున గ్యారెంటీడ్ అడిషన్ బోనస్ రూపంలో యాడ్ అవుతుంది.

వయోపరిమితి: 28 సంవత్సరాల నుండి 75 సంవత్సరాల వయస్సు గలవారు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు.

కనీస బీమా మొత్తం : రూ. 3 లక్షలు కాగా, గరిష్ఠ పరిమితి లేదు.

ప్రీమియం చెల్లింపు కాలపరిమితి (PPT): 7, 10, 12, 15 లేదా 18 ఏళ్ల ఆప్షన్లను ఎంచుకోవచ్చు.

పాలసీ వ్యవధి : 17, 20, 22, 25 లేదా 28 ఏళ్ల కాలపరిమితితో అందుబాటులో ఉంటుంది.

అదనపు సదుపాయం: బేసిక్ సమ్ అష్యూర్డ్‌లో 10 శాతం చొప్పున రెగ్యులర్ ఇన్‌కమ్‌గా ప్రతి సంవత్సరం పొందే ఆప్షన్ మరియు రుణ సదుపాయం కూడా కలదు.

LIC జీవన్ రక్ష

ఇది పూర్తిగా ఒక ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ . పాలసీదారుడు అకాల మరణం చెందితే అతని కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించే ఉద్దేశంతో తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్ ఇచ్చేలా దీన్ని రూపొందించారు.

పాలసీ స్వభావం: ఇది ప్యూర్ టర్మ్ ప్లాన్ కాబట్టి గడువు ముగిసే వరకు పాలసీదారుడు జీవించి ఉంటే ఎలాంటి మెచ్యూరిటీ ప్రయోజనాలు లభించవు. కేవలం మరణిస్తేనే కుటుంబానికి డెత్ బెనిఫిట్ అందుతుంది.

వయోపరిమితి: 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల వయసు గలవారు దీనికి అర్హులు.

బీమా మొత్తం : కనీస బీమా మొత్తం రూ. 5 లక్షలు కాగా, గరిష్ఠంగా రూ. 24 లక్షల వరకు మాత్రమే పరిమితి నిర్ణయించారు.

ప్రీమియం ఆప్షన్లు: సింగిల్ ప్రీమియం (ఒకేసారి కట్టడం), రెగ్యులర్ లేదా లిమిటెడ్ ప్రీమియం చెల్లింపు పద్ధతులను ఎంచుకోవచ్చు.

మహిళలకు ప్రత్యేక తగ్గింపు: ఈ ప్లాన్ కింద మహిళా పాలసీదారులకు ప్రీమియం ధరలలో ప్రత్యేక రాయితీలు అందుబాటులో ఉన్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement