Breaking News

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) నూతన ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా అశోక్ కుమార్ పాండా

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) నూతన ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ (CMD) పదవికి డాక్టర్ అశోక్ కుమార్ పాండాపేరును పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ (PESB) సిఫార్సు చేసింది. 

Published on: 30 Mar 2026 19:59  IST

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) నూతన ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ (CMD) పదవికి డాక్టర్ అశోక్ కుమార్ పాండాపేరును పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ (PESB) సిఫార్సు చేసింది. 

28 మార్చి 2026న జరిగిన ఇంటర్వ్యూల అనంతరం 10 మంది అభ్యర్థులలో PESB డాక్టర్ పాండాను ఎంపిక చేసింది.ఆయన ప్రస్తుతం SAILలో డైరెక్టర్ (ఫైనాన్స్) గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.ప్రస్తుత CMD అమరేందు ప్రకాష్ పదవీ కాలం ఏప్రిల్ 2, 2026తో ముగియనుంది, ఆ తర్వాత పాండా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.

ఆయనకు SAILలో 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ముఖ్యంగా కంపెనీ అప్పులను ₹20,000 కోట్లు తగ్గించడంలో కీలక పాత్ర పోషించారు.ఈ నియామకానికి ప్రధాని నేతృత్వంలోని నియామకాల క్యాబినెట్ కమిటీ (ACC) తుది ఆమోదం తెలపాల్సి ఉంటుంది.

Follow us on , &

ఇవీ చదవండి