Breaking News

భారతీయ ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ బజాజ్ ఆటో మరియు దాని అనుబంధ సంస్థ అయిన బజాజ్ ఆటో టెక్నాలజీ లిమిటెడ్ల ఐటీ మౌలిక వసతులపై రాన్సమ్‌వేర్ సైబర్ దాడి

భారతీయ ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ బజాజ్ ఆటో మరియు దాని అనుబంధ సంస్థ అయిన బజాజ్ ఆటో టెక్నాలజీ లిమిటెడ్ల ఐటీ మౌలిక వసతులపై రాన్సమ్‌వేర్ సైబర్ దాడి జరిగింది. ఈ విషయాన్ని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో అధికారికంగా వెల్లడించింది.


Published on: 24 Jun 2026 12:19  IST

భారతీయ ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ బజాజ్ ఆటో మరియు దాని అనుబంధ సంస్థ అయిన బజాజ్ ఆటో టెక్నాలజీ లిమిటెడ్ల ఐటీ మౌలిక వసతులపై రాన్సమ్వేర్ సైబర్ దాడి జరిగింది. ఈ విషయాన్ని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో అధికారికంగా వెల్లడించింది.

ఈ సైబర్ భద్రతా లోపం 2026 జూన్ 23 తేదీ మంగళవారం ఉదయం 8:00 గంటల ప్రాంతంలో జరిగినట్లు కంపెనీ గుర్తించింది.బజాజ్ ఆటో ప్రధాన సర్వర్లతో పాటు, దాని పూర్తి అనుబంధ సంస్థ అయిన బజాజ్ ఆటో టెక్నాలజీస్ సిస్టమ్స్ కూడా ఈ దాడికి గురయ్యాయి.హ్యాకింగ్ జరిగినట్లు తెలిసిన వెంటనే కంపెనీకి చెందిన సాంకేతిక బృందం , యాజమాన్యం మరియు బయటి సైబర్ సెక్యూరిటీ నిపుణులు రంగంలోకి దిగారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి అవసరమైన రక్షణ చర్యలు తీసుకున్నారు.

ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ ముప్పును విజయవంతంగా అడ్డుకున్నామని, కంపెనీ కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగలేదని బజాజ్ ఆటో స్పష్టం చేసింది.

అయితే ఈ దాడి వల్ల కంపెనీకి చెందిన ఏదైనా ముఖ్యమైన డేటా చోరీకి గురైందా లేదా అనే వివరాలను సంస్థ ఇంకా పూర్తిగా వెల్లడించలేదు.సమాచార సాంకేతిక చట్టం (IT Act, 2000) నిబంధనల ప్రకారం, ఈ సైబర్ దాడిపై భారత ప్రభుత్వ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In)కు కంపెనీ అధికారికంగా నివేదించింది.

ఈ రాన్సమ్‌వేర్ దాడి వార్తల నేపథ్యంలో, జూన్ 24 నాటి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో బజాజ్ ఆటో షేర్లు ఒత్తిడికి లోనయ్యాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) లో ఈ సంస్థ షేరు విలువ సుమారు 2% నుండి 2.5% వరకు పతనమై రూ. 9,790 వద్ద ట్రేడ్ అవుతూ నిఫ్టీలో టాప్ లూజర్‌గా నిలిచింది. కాగా, జూన్ 24వ తేదీ కంపెనీ ప్రకటించిన రూ. 5,632 కోట్ల భారీ షేర్ బైబ్యాక్ ప్రక్రియకు రికార్డు తేదీగా కూడా ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement