Breaking News

ఓలా ఎలక్ట్రిక్ తన ప్రీమియం ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ రోడ్‌స్టర్ ధరను ఏకంగా ₹60,000 తగ్గించింది

ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) తన ప్రీమియం ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ రోడ్‌స్టర్ X+ 9.1 ధరను ఏకంగా ₹60,000 తగ్గించింది.గతంలో దీని ధర ₹1,89,999 ఉండగా, ఇప్పుడు ₹1,29,999 (ఎక్స్-షోరూమ్) కు తగ్గింది.


Published on: 02 Apr 2026 16:41  IST

ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) తన ప్రీమియం ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ రోడ్స్టర్ X+ 9.1 ధరను ఏకంగా ₹60,000 తగ్గించింది. :గతంలో దీని ధర ₹1,89,999 ఉండగా, ఇప్పుడు ₹1,29,999 (ఎక్స్-షోరూమ్) కు తగ్గింది.ఓలా తన గిగా ఫ్యాక్టరీలో సొంతంగా అభివృద్ధి చేసిన '4680 భారత్ సెల్' (4680 Bharat Cell) ఉత్పత్తి పెరగడం వల్ల తయారీ ఖర్చు తగ్గింది. ఆ ప్రయోజనాన్ని కంపెనీ కస్టమర్లకు బదిలీ చేసింది.ఇది నిరంతరం అమ్మకానికి ఉండదు. కేవలం నిర్ణీత సమయాల్లో (Limited Purchase Windows) మాత్రమే లభిస్తుంది.

మొదటి విండో: ఏప్రిల్ 3, 2026 న సాయంత్రం 6:00 గంటల నుండి రాత్రి 9:00 గంటల వరకు మాత్రమే ఉంటుంది.

బైక్ ప్రత్యేకతలు:

రేంజ్: ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

టాప్ స్పీడ్: గంటకు 124 కి.మీ వేగంతో దూసుకుపోగలదు.

ఖర్చు: ఒక్క కిలోమీటర్‌కు కేవలం ₹0.09 ఖర్చు అవుతుందని కంపెనీ పేర్కొంది. 

Follow us on , &

ఇవీ చదవండి