Breaking News

కళకళలాడిన దేశీయ స్టాక్ మార్కెట్లు బుల్ పరుగు పెడితే.. గోల్డ్ మెరుపు కంటిన్యూ అయింది.

బుల్ పరుగు పెడితే.. గోల్డ్ మెరుపు కంటిన్యూ అయింది. చాలా రోజుల తర్వాత.. దేశీయ స్టాక్ మార్కెట్లు కళకళలాడాయి.


Published on: 19 Mar 2025 14:09  IST

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు దుమ్మురేపాయి! వరుసగా రెండో రోజూ లాభాల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, దేశీయంగా ఫైనాన్షియల్ , మెటల్ రంగాలలో కొనుగోళ్ల జోరుతో మార్కెట్ కళకళలాడింది. సెన్సెక్స్ ఏకంగా 1131 పాయింట్లు ఎగిసి, 75,301 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 325 పాయింట్లు లాభపడి 22,834 వద్ద స్థిరపడింది. ఒక్క సెషన్‌లోనే మదుపర్ల సంపద ఏకంగా రూ. 6.85 లక్షల కోట్లు పెరిగింది.


దీర్ఘకాలంలో స్టాక్స్ చాలా వరకు మెరుగైన రిటర్న్స్ ఇస్తుంటాయని నిపుణులు చెబుతుంటారన్న సంగతి తెలిసిందే. దీనిని రుజువు చేసేలా ఇప్పుడు ఒక స్టాక్ నిలిచింది. ఇదే సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్. ఇది 2020 సమయంలో కేవలం రూ. 5.85 వద్ద ఉండేది. ఇప్పుడు చూస్తే రూ. 640 లెవెల్స్‌లో ఉంది. ఈ సమయంలోనే ఐదేళ్ల వ్యవధిలో 10,900 శాతానికిపైగా పెరగడం విశేషం. దీంతో దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లు మంచి రిటర్న్స్ అందుకున్నారు.

ఆసియా మార్కెట్లలో ర్యాలీ కారణంగా స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ట్రేడయ్యాయి. వాణిజ్య యుద్ధ భయాలతో చాలా కాలంగా మార్కెట్లు నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. వరుస నష్టాల క్రమంలో చాలా కంపెనీల స్టాక్స్ ఆకర్షణీయంగా ఉన్నాయన్న మార్కెట్ ఎనలిస్ట్‌ల అభిప్రాయాలు మార్కెట్‌కు కలిసొచ్చింది. భారత వాణిజ్యలోటు మూడున్నర ఏళ్ల కనిష్ఠానికి దిగడం మార్కెట్‌కు సెంటిమెంట్‌ను బలపరిచింది. 2025 ఆర్థిక సంవత్సరం క్యూ3లో జీడీపీ వృద్ధి 6.2 శాతంగా నమోదు కావడం.. పారిశ్రామిక ఉత్పత్తిలో 5.1 శాతం పెరుగుదల.. స్థూల పన్ను వసూళ్లలో 16శాతం పెరుగుదల.. రిటైల్ ద్రవ్యోల్బణం 3.6 శాతానికి తగ్గడం కూడా మార్కెట్ ర్యాలీకి కారణమైంది. నిన్న అమెరికా మార్కెట్‌లు పాజిటివ్‌గా క్లోజ్ కావడం మరో కారణంగా కనిపించింది.

Follow us on , &

ఇవీ చదవండి