Breaking News

పాకిస్తాన్ జీడీపీ కంటే టాటా గ్రూప్ విలువే ఎక్కువ,,ఏకంగా రూ. 30 లక్షల కోట్లు.. అయ్యో పాపం!

భారత స్టాక్ మార్కెట్లలో ప్రస్తుతం టాటా హవా నడుస్తోంది. టాటా గ్రూప్ కంపెనీలన్నింటి మార్కెట్ విలువ ఏకంగా రూ. 30 లక్షల కోట్ల మార్క్ దాటింది. ఇక్కడ విశేషం ఏంటంటే, మన పొరుగు దేశం అయినా పాకిస్థాన్ జీడీపీ కంటే టాటా గ్రూప్ విలువ ఎక్కువ. టాటా గ్రూప్ కంపెనీలు సంవత్సరం కాలంగా భారీగా పుంజుకున్న నేపథ్యంలో ఇది సాధ్యమైంది.


Published on: 19 Feb 2024 13:41  IST

భారత్‌లో నమ్మకమైన బ్రాండ్‌గా టాటా గ్రూప్‌కు పేరుంది. ఉప్పు నుంచి విమానాల వరకు టాటా గ్రూప్ తన వ్యాపారాల్ని విస్తరించింది. టెక్, ఐటీ, విద్యుత్, టెక్స్‌టైల్,ఆటోమోటివ్, జువెలరీ, రిటైల్ ఇలా ఎన్నో రంగాల్లో  టాటా సత్తా చాటుతోంది. వీటిల్లో చాలా వరకు స్టాక్ మార్కెట్లలో లిస్టయి ఉన్నాయి. గత సంవత్సరం భారత స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా పుంజుకున్న నేపథ్యంలో టాటా  స్టాక్స్ కూడా లాభపడ్డాయి. ఈ క్రమంలోనే టాటా గ్రూప్  అరుదైన ఘనత సాధించింది.  ఇప్పుడు టాటా గ్రూప్ కంపెనీల విలువ పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కంటే పెద్దది అవడం విశేషం. టాటా గ్రూప్ మార్కెట్ విలువ 365 బిలియన్ డాలర్లుగా (భారత కరెన్సీలో రూ.30.3 లక్షల కోట్లు) ప్రస్తుతం  ఉండగా, ఇంటర్నేషనల్ మానీటరీ ఫండ్ (IMF) గణాంకాల ప్రకారం పాకిస్థాన్ జీడీపీ విలువ 341 బిలియన్ డాలర్లుగా (భారత కరెన్సీలో ఇది రూ.28.3 లక్షల కోట్లు) తో ఉంది.

ఇక పాకిస్థాన్ జీడీపీ కంటే భారత జీడీపీ దాదాపు 11 రెట్లు వరకు ఎక్కువ. ఇండియా జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ దాదాపు రూ. 296 లక్షల కోట్లతో ఉంది. త్వరలోనే జర్మనీ, జపాన్ ని దాటి భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్నట్లు అభిప్రాయపడుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి