Breaking News

ఆల్‌టైం రికార్డు చేరువకు పసిడి పరుగులు రూ.91 వేలు దాటేసిన గోల్డ్

దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. సోమవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ 90,500ఉండగా, మంగళవారం నాటికి రూ.588 పెరిగి రూ.91,088కు చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర రూ.1,02,818 ఉండగా, మంగళవారం నాటికి రూ.569 పెరిగి రూ.1,03,387కు చేరుకుంది.


Published on: 19 Mar 2025 13:50  IST

బంగారం... ఇది కేవలం ఒక లోహం మాత్రమే కాదు, ఇది భారతీయుల జీవితాల్లో ఒక భాగం.పెళ్లిళ్లు, శుభకార్యాలకు బంగారం, వెండికి మస్తు గిరాకీ ఉంటుంది. అంతగా ఇవి మన సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిపోయాయి. బంగారం సంపదకు చిహ్నం, శుభానికి సూచిక, పెట్టుబడికి భరోసా. అందుకే, బంగారం ధరల్లో ఏ చిన్న మార్పు వచ్చినా సామాన్యుడి గుండెల్లో దడ పుడుతుంది.

దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. సోమవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ 90,500ఉండగా, మంగళవారం నాటికి రూ.588 పెరిగి రూ.91,088కు చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర రూ.1,02,818 ఉండగా, మంగళవారం నాటికి రూ.569 పెరిగి రూ.1,03,387కు చేరుకుంది.

హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.91,088గా ఉంది. కిలో వెండి ధర రూ.1,03,387గా ఉంది.

విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.91,088గా ఉంది. కిలో వెండి ధర రూ.1,03,387గా ఉంది.

విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.91,088గా ఉంది. కిలో వెండి ధర రూ.1,03,387గా ఉంది.

ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.91,088గా ఉంది. కిలో వెండి ధర రూ.1,03,387గా ఉంది.

పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా బంగారం, వెండి ధరలు ఆల్‌టైం రికార్డుకు చేరుకున్నాయి. మరోవైపు రష్యా యుద్ధవిరమణకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇదే జరిగితే పుత్తడి ధరలు దిగిరావడం ఖాయం.

Follow us on , &

ఇవీ చదవండి