Breaking News

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జోన్‌ల్లో ఖాళీగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జోన్‌ల్లో ఖాళీగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌


Published on: 26 Sep 2025 16:05  IST

తెలంగాణ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌లో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జోన్‌ల్లో ఖాళీగా ఉన్న 1743 డ్రైవర్లు, శ్రామిక్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది.

డ్రైవర్లు: 1000, శ్రామిక్‌: 743, మొత్తం: 1743

అర్హత: పోస్టులను అనుసరించి ఐటీఐ, పదో తరగతితోపాటు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పని అనుభవం ఉండాలి.

వయస్సు: 2025 జూలై 1 నాటికి డ్రైవర్‌ పోస్టులకు 22 నుంచి 35 సంవత్సరాలు, శ్రామిక్‌ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్లను అనుసరించి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక: ఫిజికల్‌ మెజర్‌మెంట్‌, మెడికల్‌, డ్రైవింగ్‌ టెస్ట్‌ల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

చివరి తేదీ: 2025 అక్టోబర్‌ 28 వెబ్‌సైట్‌: www.tgprb.in

పంజాబ్‌ అండ్‌ సింథ్‌ బ్యాంకులో

190 మేనేజర్లు

పంజాబ్‌ అండ్‌ సింథ్‌ బ్యాంక్‌లో రెగ్యులర్‌ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న క్రెడిట్‌ మేనేజర్‌, అగ్రికల్చర్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లయి చేసుకోవచ్చు.

క్రెడిట్‌ మేనేజర్‌: 130, అగ్రికల్చర్‌ మేనేజర్‌: 60

మొత్తం ఖాళీలు : 190

వయస్సు: 23 నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉండాలి. అంటే అభ్యర్థులు 1990 సెప్టెంబర్‌ 2 నుంచి 2002 సెప్టెంబర్‌ 1 మధ్యలో జన్మించి ఉండాలి. రిజర్వేషన్లను అనుసరించి వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

చివరి తేదీ: 2025 అక్టోబర్‌ 10

వెబ్‌సైట్‌: punjabandsind.bank.in/

ఆర్‌ఆర్‌బీలో 368

సెక్షన్‌ కంట్రోలర్‌ పోస్టులు

దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో కలిపి మొత్తం 368 సెక్షన్‌ కంట్రోలర్‌ ఉద్యోగాల కోసం రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సింగిల్‌ స్టేజ్‌ కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ద్వారా ఉద్యోగాల ఎంపిక ఉంటుంది. మొత్తం పోస్టుల్లో సికింద్రాబాద్‌ డివిజన్‌ కింద 25 పోస్టులు ఉన్నాయి.

వయస్సు: 20 నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి.

చివరి తేదీ: 2025 అక్టోబర్‌ 14

వెబ్‌సైట్‌: rrbapply.gov.in/

Follow us on , &

ఇవీ చదవండి