Breaking News

ఎంపీగా పోటీ చేయ‌నున్న‌ యువరాజ్ సింగ్.. పార్టీ, నియోజకవర్గం ఫిక్స్

టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే తాను చేరే పార్టీలో గ్రౌండ్ సిద్దం చేసుకున్నారు. గౌతం గంభీర్, సచిన్ టెండూల్క‌ర్‌లు ప్ర‌స్తుతం ఎంపీలుగా కొన‌సాగుతున్నారు. ఇప్పుడు యువరాజ్ వీరి లిస్టులో చేరే ప్రయత్నం చేస్తున్నారు.


Published on: 23 Feb 2024 17:10  IST

టీమిండియా 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు యువరాజ్ సింగ్. తన అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్ తో భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు యువరాజ్. ఇప్పటి వరకు మైదానంలో ధనాధన్ ఇన్నింగ్స్‌ల‌తో అదరగొట్టిన యూవీ ఇప్పుడు ప్ర‌జాక్షేత్రంలో రాణించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. యువరాజ్ సింగ్ గురుదాస్‌పూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం సన్నీ డియోల్ గురుదాస్‌పూర్ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో డియోల్ స్థానంలో యువరాజ్ సింగ్ బరిలోకి దిగుతారని వార్తలు వస్తున్నాయి. ఈ నెల ప్రారంభంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో యువరాజ్ సింగ్ సమావేశమయ్యారు. దాంతో యూవీ రాజ‌కీయాల్లో అరంగేట్రం చేయ‌నున్నాడనే వార్త‌లు వైరల్ అయ్యాయి. అయితే ఈ విషయంపై యువరాజ్ మాత్రం స్పందించలేదు.

 

Follow us on , &

ఇవీ చదవండి