Breaking News

మార్చి 1 నుంచి GST కొత్త రూల్స్.. లేదంటే ఇ-వే బిల్లు జారీ కాదు!

దేశంలో వస్తు సేవల పన్ను 2017లో అమలులోకి వచ్చింది. ఆ తర్వాత GSTలో చాలా మార్పులు జరిగాయి. ఇప్పుడు మార్చి 1, 2024 నుంచి కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. ఇకపై వ్యాపారాలు తప్పనిసరిగా ఈ రూల్స్ పాటించాల్సిందే. లేదంటే ఇ-వే బిల్లు జారీ చేయడం కుదరదు. ఆ వివరాలు తెలుసుకుందాం.


Published on: 26 Feb 2024 10:47  IST

GST కి సంబంధించిన నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం భారీ మార్పులు చేసింది. కొత్త నిబంధనలు చిన్న వ్యాపారులపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి వ్యాపారం చేసే వారిపై మార్చి 1 నుంచి కొత్త నిబంధనలు తప్పనిసరి కానున్నాయి. ఈ నిబంధనలు వ్యాపారులపై ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా ఒక రాష్ట్ర నుంచి మరో రాష్ట్రానికి మధ్య వ్యాపారం కొనసాగించే వారు మార్చి 1 నుంచి అమలులోకి వచ్చే ఈ కొత్త నిబంధనలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. లేదంటే ఆ తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

GST కొత్త నిబంధనల ప్రకారం.. రూ.5 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారులు ఇప్పుడు ఇ-చలాన్ ఇవ్వకుండా ఇ-వే బిల్లు జారీ చేయలేరు. మార్చి 1 నుంచి అన్ని రకాల వ్యాపార లావాదేవీలకు ఈ నిబంధన వర్తిస్తుంది. జీఎస్‌టీ పన్ను విధానంలో రూ.50 వేలు అంత కంటే ఎక్కువ విలువైన వస్తువులను ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఎగుమతి చేస్తున్నప్పుడు ఈ-వే బిల్లు అనేది తప్పనిసరి. అయితే, ఈ కొత్త నిబంధనలు అమలులోకి వచ్చిన తర్వాత ఈ -వే బిల్లు జారీ చేయడం మరింత కఠినతరం కానుంది.

కేంద్ర ప్రభుత్వ జాతీయ సమాచార కేంద్రం (NIC) తన విశ్లేషణలో చాలా మంది వ్యాపారవేత్తలు B2B, B2E పన్ను చెల్లింపుదారులతో ఇ-ఇన్‌వాయిస్‌లతో లింక్ చేయకుండా ఇ-వే బిల్లుల ద్వారా లావాదేవీలు జరుపుతున్నట్లు గుర్తించింది. అయితే ఈ పన్ను చెల్లింపుదారులందరూ ఇ-చలాన్‌కు అర్హులు. దీని కారణంగా కొన్ని సందర్భాల్లో ఇ-వే బిల్లు, ఇ-చలాన్‌లలో నమోదు చేయబడిన విభిన్న సమాచారం ప్రమాణంతో సరిపోలడం లేదు. దీంతో GST పన్ను చెల్లింపుదారులు మార్చి 1, 2024 నుంచి ఇ-చలాన్ స్టేట్‌మెంట్ లేకుండా ఇ-వే బిల్లు జారీ చేయవద్దని కోరింది.

Follow us on , &

ఇవీ చదవండి