Breaking News

ప్రముఖ భారతీయ చిత్రకారుడు రాజా రవివర్మ పెయింటింగ్ వేలంలో రూ. 167.2 కోట్లకు అమ్ముడై సరికొత్త రికార్డు సృష్టించింది. 

ప్రముఖ భారతీయ చిత్రకారుడు రాజా రవివర్మ గీసిన 'యశోద మరియు కృష్ణ' అనే తైలవర్ణ చిత్రం ముంబైలో జరిగిన సాఫ్రోనార్ట్ వేలంలో రూ. 167.2 కోట్లకు అమ్ముడై సరికొత్త రికార్డు సృష్టించింది. 


Published on: 02 Apr 2026 16:21  IST

ప్రముఖ భారతీయ చిత్రకారుడు రాజా రవివర్మ గీసిన 'యశోద మరియు కృష్ణ' అనే తైలవర్ణ చిత్రం ముంబైలో జరిగిన సాఫ్రోనార్ట్ వేలంలో రూ. 167.2 కోట్లకు అమ్ముడై సరికొత్త రికార్డు సృష్టించింది. 

సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు, బిలియనీర్ సైరస్ పూనావాలా ఈ చిత్రాన్ని కొనుగోలు చేశారు.ఇప్పటివరకు వేలంలో అత్యధిక ధరకు అమ్ముడైన భారతీయ చిత్రపటంగా ఇది నిలిచింది. గతంలో ఎం.ఎఫ్. హుస్సేన్ గీసిన 'అన్‌టైటిల్డ్ (గ్రామ్ యాత్ర)' రూ. 118 కోట్లకు అమ్ముడవగా, ఆ రికార్డును ఈ పెయింటింగ్ దాటేసింది.

1890వ దశకంలో రాజా రవివర్మ గీసిన ఈ చిత్రంలో బాలకృష్ణుడు మరియు యశోదమ్మల మధ్య ఉన్న మాతృప్రేమను అద్భుతంగా ఆవిష్కరించారు.ముంబైలోని Saffronart లో ఏప్రిల్ 1న జరిగిన ఈ వేలంలో కేవలం ఏడు నిమిషాల్లోనే ఈ రికార్డు ధర నమోదైంది.ఈ చిత్రాన్ని జాతీయ సంపదగా అభివర్ణించిన పూనావాలా, దీనిని ఎప్పటికప్పుడు ప్రజలు చూసేలా ప్రదర్శనకు ఉంచుతానని తెలిపారు. 

Follow us on , &

ఇవీ చదవండి