Breaking News

భారత ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయాలకు స్వప్తి పలకనున్నారని బాగా ప్రచారం జరుగుతోంది.

మోదీ తర్వాత ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆధిత్యనాథ్ ప్రధాని అవుతారన్న టాక్ బాగా నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే యోగీ ఆ పుకార్లపై క్లారిటీ ఇచ్చారు.


Published on: 01 Apr 2025 15:08  IST

మోదీ రిటైర్మెంట్‌పై పుకార్లు – యోగీ ఆధిత్యనాథ్ స్పందన

ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలో రాజకీయాల నుంచి రిటైర్ కాబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మోదీ చాలా ఏళ్ల తర్వాత ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. ఆయన తర్వాత ప్రధాని పదవి కోసం ఉత్తర ప్రదేశ్ సీఎం యోగీ ఆధిత్యనాథ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మోదీ రిటైర్మెంట్‌పై, యోగీ భవిష్యత్తుపై పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ ప్రచారంపై యోగీ ఆధిత్యనాథ్ మంగళవారం స్పందిస్తూ, “నేను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని. ప్రజలకు సేవ చేయడానికి పార్టీ నన్ను ఇక్కడ నియమించింది. నేను కేవలం యోగిని మాత్రమే. ఊహాగానాలు చేసే వారి నోళ్లను ఆపలేం” అని స్పష్టం చేశారు. అంతేకాదు,నేను పార్టీ వల్లే ఇక్కడ ఉన్నాను. కేంద్ర నాయకులతో బేధాలు వస్తే.. ఇక్కడ ఉండగలుగుతానా?. పార్టీకి సంబంధించిన విషయాల్లో టికెట్లు ఎవరికి ఇవ్వాలో  పార్లమెంటరీ బోర్డు కమిటీ నిర్ణయిస్తుంది అని స్పష్టంగా తాను చెప్పాలనుకున్నది చెప్పేశారు.

యోగీ ఆధిత్యనాథ్ గత తొమ్మిదేళ్లుగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన సీఎం అయ్యాక లా అండ్ ఆర్డర్‌ను కఠినంగా అమలు చేశారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ ‘బుల్‌డోజర్‌ మంత్రి’గా పేరుపొందారు. ఈ క్రమంలో రాష్ట్రంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని అధికారికంగా వెల్లడించారు. ఆయన దీర్ఘకాలిక పాలన, విధానాలు భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో ప్రాముఖ్యత సాధిస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి