Breaking News

జమ్తారా 2 నటుడు సచిన్ చంద్వాడే 25 ఏళ్ల వయసులో ఆత్మహత్య

జమ్తారా 2 వెబ్ సిరీస్‌లో నటించిన మరాఠీ నటుడు సచిన్ చంద్వాడే 25 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకుని మరణించారు.


Published on: 27 Oct 2025 16:52  IST

జమ్తారా 2 వెబ్ సిరీస్‌లో నటించిన మరాఠీ నటుడు సచిన్ చంద్వాడే 25 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకుని మరణించారు. అతని కుటుంబసభ్యులు అక్టోబర్ 23, 2025న మహారాష్ట్రలోని జల్గావ్‌లోని పరోలాలో ఉన్న వారి ఇంట్లో అతన్ని ఉరి వేసుకున్న స్థితిలో కనుగొన్నారు. 

సచిన్ చంద్వాడేను అతని కుటుంబ సభ్యులు ఉరి వేసుకున్న స్థితిలో గుర్తించి, వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్యం విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ధూలేలోని మరో ఆసుపత్రికి తరలించారు, కానీ అక్కడ అక్టోబర్ 24 తెల్లవారుజామున 1:30 గంటలకు చికిత్స పొందుతూ మరణించారు.అతని ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదు.పోలీసులు యాక్సిడెంటల్ డెత్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సచిన్ చంద్వాడే నటుడు మాత్రమే కాదు, పుణెలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కూడా పని చేసేవారు.అతని తదుపరి మరాఠీ చిత్రం 'అసుర్వన్' విడుదల కావాల్సి ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి