Breaking News

పోస్టాఫీసు నుంచి ₹20,000 సబ్సిడీ వస్తుందంటూ వస్తున్న ఫేక్ పోస్ట్

పోస్టాఫీసు నుంచి ₹20,000 సబ్సిడీ వస్తుందంటూ వస్తున్న మెసేజ్‌లు పూర్తిగా మోసపూరితమైనవి, నకిలీవి. ఆ లింక్‌ను క్లిక్ చేస్తే డబ్బులు పోవడం ఖాయం.


Published on: 27 Oct 2025 17:16  IST

పోస్టాఫీసు నుంచి ₹20,000 సబ్సిడీ వస్తుందంటూ వస్తున్న మెసేజ్‌లు పూర్తిగా మోసపూరితమైనవి, నకిలీవి. ఆ లింక్‌ను క్లిక్ చేస్తే డబ్బులు పోవడం ఖాయం. ఇండియా పోస్ట్ ఇలాంటి సర్వేలు, బహుమతులు, బోనస్‌లు లేదా సబ్సిడీలను ఎప్పుడూ ప్రకటించదని పత్రికా సమాచార కార్యాలయం (PIB) ధృవీకరించింది. 

స్కామర్‌లు వాట్సాప్, టెలిగ్రామ్, ఇమెయిల్ లేదా SMS ద్వారా నకిలీ వెబ్‌సైట్ లింక్‌లను పంపిస్తారు.ఈ లింక్‌లపై క్లిక్ చేస్తే, కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే ₹20,000 సబ్సిడీ ఇస్తామని చెబుతారు.ఈ ప్రక్రియలో మీ పుట్టిన తేదీ, అకౌంట్ నంబర్లు, మొబైల్ నంబర్లు, OTP వంటి వ్యక్తిగత వివరాలను సేకరిస్తారు.ఈ సమాచారం, OTPతో మోసగాళ్లు మీ బ్యాంక్ ఖాతా నుండి డబ్బును మాయం చేస్తారు. తెలియని లేదా అనుమానాస్పద లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకండి.మీ వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని ఎవరికీ తెలియజేయకండి.పోస్టాఫీస్ పథకాల గురించిన సమాచారం కోసం, ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్ (indiapost.gov.in) లేదా సమీప పోస్టాఫీసును సంప్రదించండి.ఇలాంటి మెసేజ్‌ల గురించి ఏదైనా అనుమానం ఉంటే, వాటిని PIB ఫ్యాక్ట్ చెక్‌కు నివేదించండి.

Follow us on , &

ఇవీ చదవండి