Breaking News

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ మంచు కురుస్తున్నప్పటికీ, పెళ్లి కోసం ఒక పెళ్లికొడుకు తన బృందంతో సాహసం

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ మంచు కురుస్తున్నప్పటికీ, పెళ్లి కోసం ఒక పెళ్లికొడుకు తన బృందంతో కలిసి చేసిన సాహసం ఇప్పుడు వార్తల్లో నిలిచింది.


Published on: 27 Jan 2026 13:59  IST

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ మంచు కురుస్తున్నప్పటికీ, పెళ్లి కోసం ఒక పెళ్లికొడుకు తన బృందంతో కలిసి చేసిన సాహసం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లా, సరాజ్ (Seraj) ప్రాంతం.భారీ హిమపాతం కారణంగా రోడ్లన్నీ మూసుకుపోవడంతో, పెళ్లికొడుకు గితేష్ ఠాకూర్ సుమారు 7 కిలోమీటర్ల మేర మంచులో కాలినడకన ప్రయాణించి పెళ్లి కూతురు గ్రామానికి చేరుకున్నారు.

ఆ ప్రాంతంలో దాదాపు 3 నుండి 4 అడుగుల మేర మంచు పేరుకుపోయింది. రోడ్లు బ్లాక్ అవ్వడమే కాకుండా, విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది.ఇన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ, నిర్ణయించిన ముహూర్తానికే పెళ్లి జరగాలని గితేష్ మరియు అతని కుటుంబ సభ్యులు పట్టుదలతో మంచులో నడిచి వెళ్లి పెళ్లి వేడుకను పూర్తి చేసుకున్నారు.

ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి, నెటిజన్లు పెళ్లికొడుకు పట్టుదలను మెచ్చుకుంటున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి