Breaking News

బద్రీనాథ్ మరియు కేదార్‌నాథ్ ఆలయాల్లోకి హిందువులను మాత్రమే అనుమతించాలని ప్రతిపాదించింది.

బద్రీనాథ్ మరియు కేదార్‌నాథ్ ఆలయాల్లోకి హిందూయేతరుల ప్రవేశంపై నిషేధం.బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (BKTC) ఈ రెండు ప్రధాన ధామాలతో పాటు దాని పరిధిలోని మరో 47 అనుబంధ ఆలయాల్లోకి హిందువులను మాత్రమే అనుమతించాలని ప్రతిపాదించింది.


Published on: 27 Jan 2026 12:20  IST

బద్రీనాథ్ మరియు కేదార్‌నాథ్ ఆలయాల్లోకి హిందూయేతరుల ప్రవేశంపై నిషేధం.బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (BKTC) ఈ రెండు ప్రధాన ధామాలతో పాటు దాని పరిధిలోని మరో 47 అనుబంధ ఆలయాల్లోకి హిందువులను మాత్రమే అనుమతించాలని ప్రతిపాదించింది.ఆలయాల పవిత్రతను కాపాడటం మరియు ఆది శంకరాచార్యుల కాలం నాటి సంప్రదాయాలను పునరుద్ధరించడం ఈ నిర్ణయ ముఖ్య ఉద్దేశమని కమిటీ చైర్మన్ హేమంత్ ద్వివేది తెలిపారు.

ఈ ప్రతిపాదనను త్వరలో జరగబోయే బోర్డు సమావేశంలో అధికారికంగా ఆమోదించనున్నారు. ఇప్పటికే గంగోత్రి ధామ్‌లో హిందూయేతరుల ప్రవేశంపై నిషేధం విధిస్తూ గంగోత్రి టెంపుల్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది.

ఈ ఏడాది బద్రీనాథ్ ఆలయ ద్వారాలు ఏప్రిల్ 23 తెరుచుకోనున్నాయి. కేదార్‌నాథ్ ద్వారాలు తెరిచే తేదీని ఫిబ్రవరి 15న మహాశివరాత్రి నాడు ప్రకటించనున్నారు.భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 ప్రకారం మతపరమైన సంస్థలు తమ అంతర్గత వ్యవహారాలను నిర్వహించుకునే హక్కు కలిగి ఉంటాయని కమిటీ పేర్కొంది. 

Follow us on , &

ఇవీ చదవండి