Breaking News

కేరళలోని కొచ్చిలో ఉన్న వీపీఎస్ లేక్‌షోర్ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో ఈ అరుదైన వివాహం జరిగింది

ఈరోజు నవంబర్ 21, 2025 కేరళలోని ఆసుపత్రి ఎమర్జెన్సీ గదిలో వివాహం జరిగింది.కేరళలోని కొచ్చిలో ఉన్న వీపీఎస్ లేక్‌షోర్ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో ఈ అరుదైన వివాహం జరిగింది.


Published on: 21 Nov 2025 19:01  IST

ఈరోజు నవంబర్ 21, 2025 కేరళలోని ఆసుపత్రి ఎమర్జెన్సీ గదిలో వివాహం జరిగింది.కేరళలోని కొచ్చిలో ఉన్న వీపీఎస్ లేక్‌షోర్ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో ఈ అరుదైన వివాహం జరిగింది. అలపుజకు చెందిన అవని (వధువు), తుంబోలికి చెందిన షారన్ (వరుడు) శుక్రవారం మధ్యాహ్నం వివాహం చేసుకోవాల్సి ఉంది.అయితే, పెళ్లి మేకప్ కోసం అవని కారులో కుమారకోమ్‌కు వెళ్తుండగా, ఆమె ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమె వెన్నెముకకు తీవ్ర గాయం కావడంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

సమాచారం తెలుసుకున్న ఇరు కుటుంబాల సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. ముహూర్తం సమయం మించిపోతుండటంతో, నిర్ణయించిన సమయానికే వివాహం జరిపించాలని కుటుంబసభ్యులు కోరారు. వారి విజ్ఞప్తి మేరకు, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది సమక్షంలో, వధువు ఆసుపత్రి బెడ్‌పై ఉండగానే, వరుడు షారన్ ఆమె మెడలో తాళి కట్టాడు.ప్రమాదం కారణంగా బంధుమిత్రుల కోలాహలం మధ్య జరగాల్సిన వివాహం, కేవలం కొద్దిమంది సమక్షంలో, భావోద్వేగ వాతావరణంలో జరిగింది. అవనికి త్వరలోనే వెన్నెముక శస్త్రచికిత్స జరగనుందని వైద్యులు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి