Breaking News

ఎమోషనల్ పోస్ట్ చేసిన మాజీ ముఖ్యమంత్రి భార్య

భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ తాజాగా సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.


Published on: 07 Feb 2024 16:49  IST

ఈరోజు హేమంత్ సోరెన్, కల్పనా సోరెన్‌ల 18 వ పెళ్లి రోజు కాగా.. ప్రస్తుతం హేమంత్ సోరెన్ జైలులో ఉన్నారు. దీంతో ఆయన ఎక్స్‌ ఖాతాలో కల్పనా సోరెన్ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. జార్ఖండ్‌ రాష్ట్రాన్ని కాపాడేందుకు హేమంత్‌ సోరెన్‌ పోరాటం చేస్తున్నారు అని కొందరు చేస్తున్న కుట్రకు ఆయన తల వంచలేదని తెలిపారు. హేమంత్ సోరెన్ ఓటమిని అంగీకరించలేదని పోరాటం కొనసాగిస్తారని కల్పనా సోరెన్ చెప్పారు
ఇవాళ మా 18 వ పెళ్లి రోజు కానీ.. ప్రస్తుతం హేమంత్ సోరెన్ తమ కుటుంబంతో లేరు. అయినా నేను ఏమీ బాధపడట్లేదు. ఎందుకంటే నేను జార్ఖండ్ వీరుడి భార్యను  ఆయనలాగే నేను కూడా క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉంటాను. నా మొహంపై చిరునవ్వు పోకుండాహేమంత్ సోరెన్‌కు అండగా ఉంటాను అని హేమంత్ సోరెన్ ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్‌లో కల్పన సోరెన్ వెల్లడించారు
త్వరలోనే ఈ కుట్రలను ఛేదించి  హేమంత్‌ సోరెన్ ఇంటికి తిరిగి వస్తారని నమ్ముతున్నాను అంటూ వారిద్దరూ గతంలో దిగిన ఓ ఫోటోను కల్పనా సోరెన్ పోస్ట్ చేసారు.

Follow us on , &

ఇవీ చదవండి