Breaking News

ఒకేసారి రెండు రికార్డులు బద్దలు కొట్టిన జస్ప్రీత్ బుమ్రా

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మూడు ఫార్మాట్లలోనూ తోలిస్థానంలో నిలిచిన తొలి బౌలర్‌గా బుమ్రా రికార్డ్ క్రియేట్ చేశాడు.


Published on: 07 Feb 2024 15:54  IST

విశాఖ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో 9 వికెట్లు తీసిన జస్ప్రీత్ బుమ్రా.. మూడు స్థానాలు దాటుకొని ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానం కి చేరుకున్న తొలి భారత పేసర్‌గానూ బుమ్రా రికార్డ్ సృష్టించాడు. 
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా అగ్రస్థానానికి చేరుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇప్పటి వరకూ 34 టెస్టులు ఆడి పదిసార్లు ఐదు వికెట్ల హాల్ సాధించినప్పటికీ.. ఇప్పటి వరకు జస్ప్రీత్ బుమ్రా అత్యుత్తమ ర్యాంక్ 3 మాత్రమే. ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టుల్లో రాణించలేకపోయిన అశ్విన్.. ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి పడిపోయాడు.

Follow us on , &

ఇవీ చదవండి