Breaking News

ప్రధాని మోదీ సంచలన ప్రకటన

మాజీ ప్రధానమంత్రులు పి.వి. నరసింహారావు, చౌదరి చరణ్‌సింగ్‌‌కు అత్యున్నత పురస్కారం భారతరత్నతో గౌరవిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మాజీ ప్రధానమంత్రులు పి.వి. నరసింహారావు, MS స్వామినాథన్‌, చౌదరి చరణ్‌సింగ్‌‌ లకు భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రకటించారు. ఈ విషయాన్నీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ లో షేర్ చేశారు.


Published on: 09 Feb 2024 14:07  IST

మాజీ ప్రధానమంత్రులు పి.వి. నరసింహారావు, చౌదరి చరణ్‌సింగ్‌, MS స్వామినాథన్‌కు భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రకటించారు. 1972లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పీవీ నర్సింహారావు సేవలందించారు. పీవీ నర్సింహారావు 1991–96 వరకు భారత ప్రధానిగా పీవీ నర్సింహారావు పనిచేశారు.  భారతదేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో అతని నాయకత్వం కీలక పాత్ర పోషించిందన్నారు. పీవీ నర్సింహారావు వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో జన్మించారు. పీవీ నర్సింహారావుతో పాటు మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్‌, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్. స్వామినాథన్ కు సైతం కేంద్రం భారత రత్న ప్రకటించింది.

Follow us on , &

ఇవీ చదవండి