Breaking News

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

ప్రకాశం జిల్లాలో ఈరోజు (30 జనవరి 2026, శుక్రవారం) తెల్లవారుజామున ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.


Published on: 30 Jan 2026 14:59  IST

ప్రకాశం జిల్లాలో ఈరోజు (30 జనవరి 2026, శుక్రవారం) తెల్లవారుజామున ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది.ఒంగోలు నుండి విజయవాడ వైపు వెళ్తుండగా రైలు పట్టాలు తప్పింది. గూడ్స్ రైలుకు  పలు వ్యాగన్లు పక్కనే ఉన్న రెండు రైల్వే ట్రాక్‌లపై పడిపోయాయి.

ఈ ప్రమాదం వల్ల విజయవాడ - చెన్నై ప్రధాన రైల్వే మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు వివిధ స్టేషన్లలో నిలిచిపోయాయి.

సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, సాంకేతిక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టారు. ట్రాక్ పునరుద్ధరణకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

తాజా సమాచారం కోసం South Central Railway అధికారిక వెబ్‌సైట్ లేదా NTES ద్వారా రైళ్ల ఆలస్యం మరియు దారిమళ్లింపు వివరాలను తనిఖీ చేసుకోవచ్చు. 

Follow us on , &

ఇవీ చదవండి