Breaking News

కేవలం 400 మీటర్ల దూరానికి ఒక టాక్సీ డ్రైవర్ పర్యాటకురాలి వద్ద ఏకంగా ₹18,000 వసూలు చేశాడు. 

ముంబైలో ఒక అమెరికన్ పర్యాటకురాలికి ఎదురైన చేదు అనుభవం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. కేవలం 400 మీటర్ల దూరానికి ఒక టాక్సీ డ్రైవర్ ఆమె వద్ద ఏకంగా ₹18,000 వసూలు చేశాడు. 


Published on: 30 Jan 2026 15:12  IST

ముంబైలో ఒక అమెరికన్ పర్యాటకురాలికి ఎదురైన చేదు అనుభవం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. కేవలం 400 మీటర్ల దూరానికి ఒక టాక్సీ డ్రైవర్ ఆమె వద్ద ఏకంగా ₹18,000 వసూలు చేశాడు. 

జనవరి 12న ముంబై విమానాశ్రయానికి చేరుకున్న పర్యాటకురాలు, అక్కడికి కేవలం 400 మీటర్ల దూరంలో ఉన్న హోటల్‌కు వెళ్లడానికి టాక్సీ ఎక్కారు.డ్రైవర్ ఆమెను నేరుగా హోటల్‌కు తీసుకెళ్లకుండా, సుమారు 20 నిమిషాల పాటు అంధేరీ పరిసరాల్లో తిప్పి, చివరకు అదే హోటల్ వద్ద దించి ₹18,000 ($200) వసూలు చేశాడు.

బాధితురాలు జనవరి 26న తన ఎక్స్‌ (X) ఖాతాలో టాక్సీ నంబర్‌తో సహా పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పందించిన ముంబై సహర్ పోలీసులు, జనవరి 30న నిందితుడైన 50 ఏళ్ల దేశ్‌రాజ్ యాదవ్‌ను అరెస్ట్ చేశారు.

నిందితుడిపై చీటింగ్ కేసు నమోదు చేయడమే కాకుండా, అతని డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేసే ప్రక్రియను కూడా పోలీసులు ప్రారంభించారు

 

Follow us on , &

ఇవీ చదవండి