Breaking News

ప్రత్యేక హెలికాప్టర్‌లో గుడుపల్లి మండలం అగస్త్య ఇంటర్నేషనల్ పాఠశాల ప్రాంగణంలోని హెలిప్యాడ్‌కు చేరుకున్నా చంద్రబాబు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2026, జనవరి 30 (శుక్రవారం) నుండి తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో  మూడు రోజుల పర్యటనను ప్రారంభించారు. 


Published on: 30 Jan 2026 17:32  IST

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2026, జనవరి 30 (శుక్రవారం) నుండి తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో  మూడు రోజుల పర్యటనను ప్రారంభించారు. 

మధ్యాహ్నం 2:35 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో గుడుపల్లి మండలం అగస్త్య ఇంటర్నేషనల్ పాఠశాల ప్రాంగణంలోని హెలిప్యాడ్‌కు చేరుకున్నారు.గుడుపల్లిలో రూ. 3 కోట్లతో నిర్మించిన అగస్త్య విద్యాచల్ అకాడమీ ప్రారంభం.రూ. 10 కోట్లతో నిర్మించనున్న లెర్నర్స్ అకాడమీ (వసతి కేంద్రం) కి శంకుస్థాపన.కుప్పం మున్సిపాలిటీలో స్వర్ణ నవదిశ కో-వర్కింగ్ స్పేస్, ప్రభుత్వ గ్రంథాలయం మరియు ఆదిత్య బిర్లా నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు.

సుమారు రూ. 690 కోట్ల విలువైన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అలాగే రూ. 675 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు స్థాపించేందుకు 7 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు.కాంగుంది హెరిటేజ్ విలేజ్ బౌల్డరింగ్ పార్క్, పున్నమి రిసార్ట్ మరియు 'డిస్కవర్ కుప్పం' వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.

కుప్పం రాకముందు గంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH) లో రూ. 100 కోట్లతో నిర్మించిన మాతా-శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించి అక్కడ నుండి కుప్పం చేరుకున్నారు. జనవరి 31న గిన్నిస్ రికార్డ్ లక్ష్యంగా 5,555 ఈ-సైకిళ్ల పంపిణీ మరియు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొంటారు.

Follow us on , &

ఇవీ చదవండి