Breaking News

గుండెపోటుతో ఇంటెలిజెన్స్‌ ఏస్ఐ మృతి

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ సబ్ డివిజన్ ఇంటెలిజెన్స్‌ విభాగంలో పనిచేస్తున్న ఏఎస్ఐ నారాయణ (55) గారు 2026, జనవరి 29 గురువారం రాత్రి గుండెపోటుతో మరణించారు. 

Published on: 30 Jan 2026 19:01  IST

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ సబ్ డివిజన్ ఇంటెలిజెన్స్‌ విభాగంలో పనిచేస్తున్న ఏఎస్ఐ నారాయణ (55) గారు 2026, జనవరి 29 గురువారం రాత్రి గుండెపోటుతో మరణించారు. 

విధులు ముగించుకుని బైపాస్ రోడ్డు గుండా బైక్‌పై ఇంటికి వెళ్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కిందపడి అక్కడికక్కడే మృతి చెందారు.ఈయన న్యాల్‌కల్ మండలం చీకుర్తి గ్రామానికి చెందినవారు, ప్రస్తుతం జహీరాబాద్‌లో నివసిస్తున్నారు.

జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్‌కల్, ఝరాసంగం మండలాల్లో ఇంటెలిజెన్స్ ఫీల్డ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన సమాచార సేకరణలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆయన మృతి పట్ల పోలీసు ఉన్నతాధికారులు మరియు ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు. 

Follow us on , &

ఇవీ చదవండి