Breaking News

భార్యను కత్తితో పొడిచి హత్య చేసిన భర్త


Published on: 31 Jan 2026 17:17  IST

నెల్లూరు నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడో భర్త. చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో శ్రీహరి అనే వ్యక్తి తన భార్య శ్రీనందినిని కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. శ్రీహరి, శ్రీనందినికి ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి తొమ్మిది నెలల కుమార్తె ఉంది. కొంతకాలంగా వీరి మధ్య తీవ్ర గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించిన భర్త..తరచూ గొడవులు పడినట్లు తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి