Breaking News

కేసీఆర్ హయాంలో అవినీతికి పాల్పడ్డారు


Published on: 31 Jan 2026 17:18  IST

కేసీఆర్ హయాంలో భారీగా అవినీతికి పాల్పడ్డారని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో దొరల పాలనలో పేదలు అనేక ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. వారి అకౌంట్‌లు నింపుకోవాలని చూశారే తప్ప.. పేదల సంక్షేమానికి కృషి చేయలేదని ధ్వజమెత్తారు. రెండుసార్లు మాయమాటలు చెప్పి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందన్నారు. వారి స్వలాభం కోసం కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని ఎద్దేవా చేశారు. 

Follow us on , &

ఇవీ చదవండి