Breaking News

సీఎంను తిట్టడం ప్రజాస్వామ్య విరుద్ధం..


Published on: 02 Feb 2026 16:54  IST

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై(CM Chandrababu Naidu) వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన అసభ్య వ్యాఖ్యలను కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ(Union Minister Srinivas Varma) తీవ్రంగా ఖండించారు. సోమవారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. అంబటి రాంబాబు వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని తిట్టడం ప్రజాస్వామ్య విరుద్ధమని, రాజకీయాల్లో నైతిక విలువలకు పూర్తి వ్యతిరేకమని విమర్శించారు.

Follow us on , &

ఇవీ చదవండి