Breaking News

ఇక్కడ ఓట్లు అమ్మబడవు...


Published on: 03 Feb 2026 16:48  IST

ఇక్కడ నోటుకు ఓటు అమ్మబడవు అంటూ అశ్వారావుపేటలో అప్పారావు అనే ఓ వ్యక్తి తన ఇంటి ముందు గేటుకు ఫ్లెక్సీ కట్టారు. అశ్వారావుపేటలో మునిసిపాలిటీ ఎన్నికలు జరుగుతున్నాయి. అభ్యర్థులు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. వార్డు, నిలబడిన అభ్యర్థులనుబట్టి ఓటుకు ఇంత ఇస్తారంట అంటూ పట్టణంలో రకరకాల ప్రచారం జరుగుతుంది. పట్టణానికి చెందిన ఎలక్ర్టికల్‌ వ్యాపారి అప్పారావు తమ ఇంట్లో ఓట్లు నోటుకు అమ్మబడవు అంటూ ఫ్లెక్సీ పెట్టడం చర్చనీయాంశంగా మారింది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement