Breaking News

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పవన్


Published on: 04 Feb 2026 10:54  IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ త్వరలో తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈనెల 7,8 తేదీల్లో బీజేపీకి మద్దతుగా పవన్‌ ప్రచారం చేయనున్నారు. నిన్న (మంగళవారం) కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు రామచందర్‌రావు.. పవన్ కల్యాణ్‌ను కలిశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మున్సిపల్ ఎన్నికలు సహా పలు కీలక అంశాలపై ముగ్గురు నేతలు చర్చించారు.

Follow us on , &

ఇవీ చదవండి