Breaking News

ఇదిగో పులి..!


Published on: 04 Feb 2026 12:33  IST

గత నాలుగు రోజులుగా రాజమహేంద్రవరం రూరల్‌ పరిసర మండలాలను వణికిస్తున్న పెద్దపులి ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో రాజమహేంద్రవరం సమీపంలోని ఆటోనగర్‌లో పులి సంచరించినట్టు అటవీ అధికారులు ధ్రువీకరించారు. ఆ ప్రాంతంలో షాపులన్నీ మూయించి వేశారు. ఈ ప్రాంతం రిజర్వు ఫారెస్టుకు చేర్చి ఉంటుంది. దీంతో లాలాచెరువు, దివాన్‌చెరువు, వెలుగుబంద, పాలచర్ల తదితర గ్రామాల ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి