Breaking News

ప్రజావసర స్థలాల్లో భవనాలు.. సీజ్‌ చేసిన హైడ్రా


Published on: 05 Feb 2026 11:55  IST

మణికొండ మునిసిపాలిటీ పరిధి వెంకటేశ్వర కాలనీలో అక్రమంగా నిర్మిస్తున్న రెండు భవనాలను హైడ్రా బుధవారం సీజ్‌ చేసింది. ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాన్ని ప్లాట్లుగా విభజించి, నకిలీ క్రమబద్ధీకరణ సర్టిఫికెట్లు(ఎల్‌ఆర్‌ఎస్‌) సృష్టించి అనుమతులు తీసుకున్నట్టు నిర్ధారణకు వచ్చిన అధికారులు చర్యలకు శ్రీకారం చుట్టారు. హెచ్‌ఎండీఏ అనుమతితో వెంకటేశ్వరకాలనీ లే అవుట్‌ అభివృద్ధి చేశారు. ఇందులో ప్రజావసరాలకు 300 చదరపు గజాల చొప్పున నాలుగు ప్లాట్లు కేటాయించారు.

Follow us on , &

ఇవీ చదవండి