Breaking News

రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగం..


Published on: 05 Feb 2026 18:09  IST

రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం ప్రారంభమైంది. విపక్ష ఎంపీల ఆందోళనలతో లోక్ సభ వరుసగా వాయిదాలు పడుతోంది. ఈ మేరకు రాజ్యసభలో నేడు ప్రధాని మోదీ ప్రసంగిస్తున్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన ప్రసంగం మెుదలైంది. మరోవైపు అమెరికా-భారత్ ట్రేడ్ డీల్ పైనా మోదీ ప్రసంగించనున్నారు. అయితే, మోదీ ప్రసంగాన్ని విపక్ష పార్టీల సభ్యులు అడ్డుకుంటున్నారు. వారి నిరసనల మధ్యే ప్రధాని ప్రసంగం సాగుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి