Breaking News

రెండో వాహనం కొంటున్నారా..?


Published on: 06 Feb 2026 16:19  IST

రాష్ట్రంలో రెండో వాహనం కొనుగోలు చేసే వారికి విధిస్తున్న 2 శాతం అదనపు లైఫ్ ట్యాక్స్‌ను ప్రభుత్వం రద్దు చేయాలని నిర్ణయించింది. రవాణాశాఖ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఇప్పటివరకు ఒకరి పేరుపై ఇప్పటికే వాహనం ఉంటే.. రెండో వాహనం కొనుగోలు సమయంలో అదనపు పన్ను చెల్లించాల్సి వచ్చేది. సాధారణంగా రూ.1.20 లక్షల విలువైన బైక్ కొనుగోలు చేస్తే సుమారు రూ.2,400 వరకు అదనపు ట్యాక్స్ పడుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement