Breaking News

టాలీవుడ్‌కు ఎప్పుడూ అండగా ఉంటుంది


Published on: 06 Feb 2026 18:45  IST

టాలీవుడ్‌ ఎలాంటి సాయం కోరినా తెలంగాణ ప్రభుత్వం చేస్తుందని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. తెలుగు చిత్ర పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ కమిటీ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘భారతీయ చలన చిత్ర పరిశ్రమకు హైదరాబాద్‌ను కేంద్రంగా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. ఈ మేరకు బ్లూప్రింట్‌ కూడా సిద్ధం చేశాం. ప్రతిభ, వాతావరణ పరిస్థితులు.. ఇలా పలు అంశాల్లో హైదరాబాద్‌ ప్రత్యేకమైంది.

Follow us on , &

ఇవీ చదవండి