Breaking News

ఆ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది


Published on: 15 May 2025 17:59  IST

జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో ఏపీకి తీరని నష్టం చేసిందని మంత్రి నారాయణ ఆరోపించారు. అమృత స్కీమ్ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శలు చేశారు. ఇవాళ(గురువారం) నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 339 అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు.

Follow us on , &

ఇవీ చదవండి