Breaking News

చైర్మన్‌కు సెక్యూరిటీని పునరుద్ధరించండి


Published on: 07 Feb 2026 14:26  IST

రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ విజయ్‌ ప్రతా్‌పరెడ్డికి 1 ప్లస్‌ 1 సెక్యూరిటీని పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పోలీసు భద్రత ప్రాథమిక హక్కు కానప్పటికీ... ప్రభుత్వ అధికారికి గతంలో ఉన్న భద్రతను తొలగించేటప్పుడు బలమైన కారణాలను చూపాలని కోర్టు స్పష్టం చేసింది. ప్రాణానికి ముప్పు లేదనే కారణంతో భద్రతను తొలగించడం సరికాదని పేర్కొంది. రెండు వారాల్లో పిటిషనర్‌కు భద్రతను పునరుద్ధరించాలని హోంశాఖ కార్యదర్శిని ఆదేశించింది.

Follow us on , &

ఇవీ చదవండి