Breaking News

నడి సంద్రంలో చమురు స్మగ్లింగ్‌..


Published on: 07 Feb 2026 17:29  IST

నడి సముద్రంలో చమురు స్మగ్లింగ్‌ చేస్తున్న ఓ ముఠాను భారత కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది సమర్థవంతంగా అడ్డుకున్నారు. ముంబయికి 100 నాటికల్‌ మైళ్ల దూరంలో నిర్వహించిన ఆపరేషన్‌లో మూడు నౌకలను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. భారత ఎక్స్‌క్లూజివ్‌ ఎకనామిక్‌ జోన్‌ లో అనుమానస్పద కదలికలను కోస్ట్‌గార్డ్‌ అధికారులు గుర్తించారు. దీంతో సమీపంలోని ఓడల రాకపోకలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో మూడు నౌకలను అడ్డుకుని తనిఖీ నిర్వహించారు.

Follow us on , &

ఇవీ చదవండి